పగిలిన టైర్.. కారు బోల్తా | Road accident due to tier bursting | Sakshi
Sakshi News home page

పగిలిన టైర్.. కారు బోల్తా

Jul 24 2015 12:21 AM | Updated on Mar 28 2018 11:08 AM

పగిలిన టైర్.. కారు బోల్తా - Sakshi

పగిలిన టైర్.. కారు బోల్తా

ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్న కారు ముందు టైర్ పగిలిపోవడంతో వాహనం బోల్తాపడింది...

- ఇద్దరికి గాయాలు
- నుజ్జునుజ్జయిన వాహనం
మహేశ్వరం:
ఔటర్ రింగ్ రోడ్డుపై వెళ్తున్న కారు ముందు టైర్ పగిలిపోవడంతో వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయి ఇద్దరికి గాయాలయ్యాయి. మండల పరిధిలోని తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డు బ్రిడ్జిపై ఈ సంఘటన గురువారం చోటు చేసుకుంది. స్థానికులు,  క్షతగాత్రుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లాకు చెందిన అరుణ్‌రెడ్డి తన సోదరి సుష్మారెడ్డి కలిసి అంబర్‌పేట్ నుంచి గచ్చిబౌలికి ఔటర్‌రింగ్ రోడ్డుపైన కారులో వెళ్తున్నాడు. ఉదయం 10 గంటలకు  తుక్కుగూడ ఔటర్ రింగ్ రోడ్డు బ్రిడ్జి దగ్గరకు  రాగానే కారు ముందు టైరు పేలడంతో వాహనం బోల్తాపడింది.

ఈ ప్రమాదంలో కారు డ్రైవ్ చేస్తున్న అరుణ్‌రెడ్డితో పాటు ముందు సీట్లో కూర్చున్న అతడి సోదరి సుష్మారెడ్డి తల, ముఖానికి స్వల్పగాయాలయ్యాయి. వెంటనే ఔటర్ రింగ్ రోడ్డుపైన టోల్‌గేట్ సిబ్బంది గమనించి దగ్గరలో ఉన్న తుక్కుగూడలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వారిని తరలించారు. ప్రమాద విషయాన్ని వారి బంధువులకు తెలియజేశారు. అనంతరం క్షతగాత్రులను హైదరాబాద్ తీసుకెళ్లారు. కాగా, సుష్మారెడ్డి గచ్చిబౌలిలో ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ప్రమాదంలో కారు నుజ్జునుజ్జయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement