కావ్యం మీద తిరుగుబాటు నవల

Revolt novel on the epic : Ampasayya Naveen - Sakshi

సాహిత్య సభలకు ప్రజలు రారనే అపప్రదని ఈ ప్రపంచ తెలుగు మహాసభలు పటాపంచలు చేశాయని రచయిత అంపశయ్య నవీన్‌ వ్యాఖ్యానించారు. ఆయన అధ్యక్షతన తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన సదస్సులో నవలా సాహిత్యంపై విస్తృతంగా చర్చ జరిగింది. కవిత్వం మీద చేసిన తిరుగుబాటు నవల అనీ, అంతకుముందున్న ప్రబంధాలూ, కావ్యాలూ కొన్ని వర్గాలకే సొంతం అయినా నవల అందరికీ సాహిత్యాన్ని చేరువ చేసిందని సదస్సు అభిప్రాయపడింది. యశోదారెడ్డి నవలల్లో తెలంగాణ గ్రామీణ భాష, యాస, శ్వాసలుగా నిలిచాయని వక్తలు ప్రశంసించారు. కాసుల ప్రతాపరెడ్డి నవలా సాహిత్యం– తొలిదశను వివరిస్తూ కందుకూరి వీరేశలింగం ‘రాజశేఖర చరిత్ర’ తొలి నవల అన్నారు కానీ అది ఓ ఇంగ్లీషు నవలకి అనుసరణ మాత్రమేననీ, ఒద్దిరాజు∙సీతారామచంద్రరావు రాసిన రుద్రమదేవి తొలి నవల అనీ అభిప్రాయపడ్డారు. దేవులపల్లి కృష్ణమూర్తి, అటవీశాఖా మంత్రి జోగు రామన్న, వి.శంకర్, త్రివేణి హాజరైన ఈ నవలా సాహిత్య సదస్సు మంచి నవలల ఆవశ్యకతను చాటిచెప్పింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top