కాగ్నా నది నుంచి అక్రమంగా తరలించి నిల్వ ఉంచిన ఇసుక డంప్‌లను రెవెన్యూ అధికారులు శనివారం సీజ్ చేశారు.
రంగారెడ్డి (యాలాల) : కాగ్నా నది నుంచి అక్రమంగా తరలించి నిల్వ ఉంచిన ఇసుక డంప్‌లను రెవెన్యూ అధికారులు శనివారం సీజ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. రంగారెడ్డి జిల్లా యాలాల మండల పరిధిలో సంగెంకుర్దు సమీపంలోని ఎల్లమ్మ మాత ఆలయం పక్కన, యాలాలకు వెళ్లే మార్గంలో ఇసుక నిల్వలు ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది.
ఈ మేరకు రెవెన్యూ సిబ్బంది తనిఖీలు చేయగా సుమారు 7 ట్రాక్టర్ల ఇసుక నిల్వలను గుర్తించినట్లు ఆర్‌ఐ తెలిపారు. ఇసుక నిల్వలను సీజ్ చేసి నివేదికను సబ్‌కలెక్టర్‌కు పంపించినట్లు ఆర్‌ఐ చాంద్‌పాష పేర్కొన్నారు.