రిజర్వేషన్ల పెంపుపై సందేహాలు తీర్చాలి | Revanth Reddy Open Letter To CM KCR | Sakshi
Sakshi News home page

రిజర్వేషన్ల పెంపుపై సందేహాలు తీర్చాలి

Apr 13 2017 2:13 AM | Updated on Aug 14 2018 11:02 AM

రిజర్వేషన్ల పెంపుపై సందేహాలు తీర్చాలి - Sakshi

రిజర్వేషన్ల పెంపుపై సందేహాలు తీర్చాలి

ప్రత్యేక శాసనసభ సమావేశాలకు ముందు గానే ముస్లింలు, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లను కల్పించడంపై ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

సీఎంకు రేవంత్‌రెడ్డి బహిరంగలేఖ
సాక్షి, హైదరాబాద్‌: ప్రత్యేక శాసనసభ సమావేశాలకు ముందు గానే ముస్లింలు, ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్లను కల్పించడంపై ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. తూతూ మంత్రంగా బిల్లులను పాస్‌ చేసి చేతులు దులుపుకోవాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరిం చారు.

ముస్లిం రిజర్వేషన్లను అంగీకరించమంటున్న కేంద్రాన్ని ఎలా ఒప్పిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తమిళనాడు తరహాలో ప్రవేశపెట్టనున్న రిజర్వేషన్‌ బిల్లుల పై బుధవారం సీఎం కేసీఆర్‌కు ఆయన బహిరంగ లేఖ రాశారు. తమిళనాడులో రిజర్వేషన్లను ఏ విధంగా చట్టబద్ధం చేసిందో ప్రభుత్వం అధ్యయనం చేయాలని సూచించారు. అయితే దీనిపై అధ్యయనం చేసిన దాఖలాలు కనిపించటంలేదన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement