పప్పు.. హల్వా.. పాన్‌ | Recipes for telugu maha sabhalu | Sakshi
Sakshi News home page

పప్పు.. హల్వా.. పాన్‌

Dec 13 2017 2:26 AM | Updated on Dec 13 2017 2:26 AM

Recipes for telugu maha sabhalu - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టా త్మకంగా ఈనెల 15 నుంచి నిర్వహించ నున్న ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ వంటకాలు ఏర్పాటు చేయనున్నా రు. సభలకు హాజరవుతున్న ప్రతినిధులకు 4 రోజుల పాటు భోజనాలందించే బాధ్యతను పౌరసరఫరాల శాఖ తీసుకుంది. ఉత్తరభారత వంటకాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.

16వ తేదీ...: తెల్ల అన్నంతో పాటు వెజ్‌ బిర్యాని, వడియాల పులుసు, బగార బైగాన్, బెండకాయ ప్రై, పాలకూర పప్పు, చింతకాయ–పండు మిర్చి చట్నీ, దొండకాయ పచ్చడి, పచ్చి పులుసు, టమాటా రసం, చింతపండు పులిహోర, క్యారె ట్‌ హల్వా, భక్షాలు, పూరీతో పాటు పన్నీర్‌ బట్టర్‌ మసాలా అందిస్తారు.
17వ తేదీ...: జీరా రైస్, బీరకాయ – టమాట, సోయాకూర, మెంతుల పులుసు, వంకాయ సోగి, పుంటి కూర పప్పు, దోసకాయ చట్నీ, పచ్చి మిర్చి తొక్కు, పచ్చి పులుసు, దగడ్డ పులుసు, పెసరు గారెలు, బూందీలడ్డు, సోరకాయ హల్వా, చపాతీ, ఆలూ మట్టర్‌ ఏర్పాటు చేశారు.
18వ తేదీ...: భగారా రైస్, క్యాప్సికం కూర, సొరకాయ పొడి పప్పు, ఆలూ వేపుడు, గంగవాయిలు–మామిడికాయ పప్పు, టమాట చట్నీ, బీరకాయ పచ్చడి, పచ్చి పులుసు, మజ్జిగ చారు, మక్క గారెలు, ఖుర్బానికా మీటా, ఐస్‌ క్రీం, జొన్న రొట్టెతో నార్త్‌ ఇండియన్‌ స్పెషల్‌ మిక్స్‌డ్‌ వెజ్‌ కర్రీ ఉంటుంది.
19వ తేదీ...: టమాటా రైస్, చిక్కుడుకాయ – టమాటా కూర, వంకాయ పులుసు, కంద వేపుడు, టమాట పప్పు, వంకాయ చట్నీ, పుంటికూర చట్నీ, పచ్చి పులుసు, దాల్చా, అరటికాయ బజ్జీ, డబుల్‌ కా మీటా, బెల్లం జిలేబీ, రుమాల్‌ రోటీతో పాటు నార్త్‌ ఇండియన్‌ స్పెషల్‌ ఆలూ పాలక్‌ అందజేస్తారు.

ప్రతీ రోజూ అందించే వంటకాలు
వైట్‌ రైస్, సలాడ్, సకినాలు, సర్వపిండి, చల్ల మిరపకాయలు, పాపడ్, పొడులు (3 రకాలు), చట్నీలు (3 రకాలు), నెయ్యి, పెరుగు, పప్పు చారు, కట్‌ మిర్చీ, పాన్‌ (స్వీట్, సాదా) అందజేస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement