రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ గెలుపు ఖాయమని ఎంపీ జితేందర్‌రెడ్డి అన్నారు.
కేసీఆర్ చెప్పినట్టుగానే ఎన్డీయే అభ్యర్థిగా రాజకీయ అనుభవం, దళిత వర్గానికి చెందిన రామ్‌నాథ్ కోవింద్‌ను మోదీ ఎంపిక చేశారన్నారు. అనంతరం ఎంపీ వినోద్ మాట్లాడుతూ.. విభజన చట్టంలో పేర్కొన్న హామీలను సాధించుకోవడానికి ఈ సమావేశాల్లో పట్టుబడతామని అన్నారు. చట్టంలో పొందుపరిచినట్టు ఉమ్మడి హైకోర్టు విభజన, అసెంబ్లీ సీట్ల పెంపును చేపట్టాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సీట్ల పెంపునకు ఉద్దేశించిన బిల్లు సిద్ధంగా ఉందని, మూడు రోజుల్లో అది పార్లమెంటు ముందుకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు.