వెలుగుల దివ్వె ఎన్టీపీసీ

Ramagundam NTPC foundation Day today - Sakshi

నేడు 40వ వసంతంలోకి...

తెలంగాణకే వెలుగు కిరణం

200 మెగావాట్లతో ప్రారంభం

2,600 మెగావాట్ల కు చేరిన సామర్థ్యం

నేడు ఆవిర్భావ దినోత్సవం 

సాక్షి, పెద్దపల్లి/జ్యోతినగర్‌: దక్షిణభారత దేశానికి వెలుగులు పంచుతున్న రామగుండం ఎన్టీపీసీ 40వ వసంతంలోకి అడుగు పెట్టింది. నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రానికి వెలుగు కిరణాలను అందిస్తున్న ఎన్టీపీసీ గణనీయ పురోగతిని సాధిస్తోంది. 200 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో 40 సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఎన్టీపీసీ అంచెలంచెలుగా ఎదిగి 2,600 మెగావాట్ల సామర్థ్యానికి చేరుకొంది. ప్రపంచ విద్యుత్‌ సంస్థలతో పోటీపడుతూ, ఎన్నో అవార్డులు సొంతం చేసుకొని, రాష్ట్ర ఖ్యాతిని దశదిశలా వ్యాపింపచేస్తోంది. రామగుండం ఎన్టీపీసీ మంగళవారం 40వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న కథనం..

1978లో శ్రీకారం
అప్పటి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా, ప్రస్తుత పెద్దపల్లి జిల్లా రామగుండంలో 1978 నవంబర్‌ 14న నాటి ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్‌ చేతుల మీదుగా ఎన్టీపీసీ పురుడు పోసు కుంది. 1983 అక్టోబర్‌ 23 నుంచి ప్లాంట్‌ వెలుగులు పంచడం మొదలుపెట్టింది. దేశంలోనే తొలిసారిగా ఐఎస్‌వో 14001 సర్టిఫికెట్‌ ‘సూపర్‌ థర్మల్‌ పవర్‌ స్టేషన్‌’ అవార్డు పొందింది. ప్రపంచ స్థాయి విద్యుత్‌ సంస్థలతో పోటీ పడుతూ ఎన్నో రికార్డులను నెలకొల్పింది. 

2,600 మెగావాట్ల సామర్థ్యం
200 మెగావాట్ల సామర్థ్యంతో ప్రారంభమైన ఎన్టీపీసీ ప్రస్తు తం 2,600 మెగావాట్ల సామర్థ్యానికి చేరుకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏడు నెలల్లోనే 11,048.100 మిలియన్‌ యూనిట్లను 82.78 శాతం పీఎల్‌ఎఫ్‌ (ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌)తో ఉత్పత్తి చేసింది. 2016–17 వార్షిక సంవత్సరం లో 19,597.497 మిలియన్‌ యూనిట్లను 86.04 శాతం పీఎల్‌ఎఫ్‌తో ఉత్పత్తి చేసింది. రామగుండంలో ఈ ఏడాది మార్చి 29న ఒక్కరోజు 64.401 మిలియన్‌ యూనిట్ల విద్యు దుత్పత్తి చేసి రికార్డు సాధించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, గోవా, పాండిచ్చేరి రాష్ట్రాలకు ఇక్కడి నుంచి విద్యుత్‌ సరఫరా అవుతోంది. 

త్వరలో ‘తెలంగాణ’ వెలుగులు
రాష్ట్ర పునర్విభజన ప్రకారం తెలంగాణకే త్వరలో ఎన్టీపీసీ వెలుగులు పంచబోతోంది. నిర్మాణ దశలో ఉన్న 1,600 మెగావాట్ల సామర్థ్యం ఉన్న తెలంగాణ ప్రాజెక్ట్‌ పూర్తయితే, మన రాష్ట్రానికి మరింత విద్యుత్‌ అందనుంది. తెలంగాణ స్టేజీ–1లో 800 మెగావాట్ల సామర్థ్యమున్న రెండు యూనిట్ల నిర్మాణం ప్రస్తుతం సాగుతోంది. దీనితో ఎన్టీపీసీకి 1,600 మెగావాట్ల విద్యుత్‌ అదనంగా అందనుంది. తెలంగాణ స్టేజీ–1ను 2016లో ప్రధాని మోదీ ప్రారంభించారు. సూపర్‌ క్రిటికల్‌ టెక్నాలజీతో సంవత్సరానికి 8.0 మెట్రిక్‌ టన్నుల బొగ్గు, రెండు టీఎంసీల ఎల్లంపల్లి ప్రాజెక్టు నీటి వినియోగం, మందాకిని–బి కోల్‌మైన్, ఒడిశా, డబ్ల్యూపీ ఎల్‌ కోల్‌ లింకేజీతో రూ.10,598.98 కోట్లతో ప్రాజెక్టు నిర్మాణపనులు వేగంగా సాగుతున్నాయి. సోలార్‌ విద్యుత్‌ ను సంస్థ ఉత్పత్తి చేస్తోంది. సోలార్‌ ఫొటో వొల్టాయిక్‌ టెక్నా లజీతో క్రిస్టాలిన్‌ సిలికాన్‌ మోడ్యూల్స్‌తో విద్యుత్‌ ఉత్పత్తి చేస్తోంది. 2016–17లో 16.101 మిలియన్‌ యూనిట్లను 18.39 సీయూఎఫ్‌తో విద్యుత్‌ ఉత్పత్తి జరిగింది. దీనిని 132 కేవీ ద్వారా గ్రిడ్‌కు అనుసంధానించారు.

అవార్డులు...

- స్వర్ణశక్తి అవార్డు 2015–16 (విన్నర్‌ సీఎస్సార్‌–సీడి, రన్నర్‌ ప్రోడక్టివిటీలో) 
ఎన్టీపీసీ బీఈ మోడల్‌ 2016–17లో ద్వితీయ స్థానం.
ఎంజీఆర్‌ విభాగం ఉద్యోగులకు విశ్వకర్మ పురస్కారం
క్వాలిటీ సర్కిల్‌ ఫోరమ్‌ ఆఫ్‌ ఇండియా చాప్టర్‌ అవార్డు.
గ్రీన్‌టెక్‌ సేఫ్టీ అవార్డు–2016
ఎనర్జీ ఎఫీషియెంట్‌ యూనిట్‌ అవార్డు

అంతర్జాతీయ గుర్తింపు
రామగుండం ఎన్టీపీసీకి 2015 ప్రపంచ అత్యుత్తమ ప్రాజెక్టుగా అమెరికా పవర్‌ మ్యాగజైన్‌ గుర్తింపు దక్కింది. 442 రోజులు నిరంతర విద్యుత్‌ ఉత్పత్తి చేసి జాతీయ స్థాయి రికార్డును సొంతం చేసుకుంది. 
 – దిలీప్‌కుమార్‌ దూబే,ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్, ఎన్టీపీసీ రామగుండం

89 శాతం బూడిద..
విద్యుత్‌ ఉత్పత్తిలో భాగంగా విడుదలయ్యే బూడిదను 89.04 శాతం ఉపయోగంలోకి తెచ్చారు. రైల్వే వ్యాగన్ల ద్వారా బూడిదను తరలించి, భూగర్భ గనుల్లో నింపేం దుకు చర్యలు తీసుకొంటున్నారు.  రైతులకు ఉచిత బూడిద సరఫరా చేయడంతో పాటు, బొగ్గు పూర్తిగా తొలగించిన ఓపెన్‌కాస్టు మైన్‌లను బూడిదతో నింపేందుకు ప్రణాళిక లు రూపొందిస్తున్నారు. 100 శాతం బూడిద వినియోగానికి ప్రత్యేక చర్య లు తీసుకుంటున్నారు. విద్యుదుత్ప త్తిలో రక్షణ చర్యలకు సంస్థ అధిక ప్రాధాన్యతనిస్తోంది. సేప్టీ మేనేజ్‌ మెంట్‌ విధానం ద్వారా ప్రతి విభా గంలో రక్షణ బృందాలను ఏర్పాటు చేసి అనుక్షణం గమనిస్తుంటారు. క్వాలిటీ సర్కిల్‌ బృందాల ద్వారా వృత్తి నైపుణ్యతను పెంచుతూ, విద్యుదుత్పత్తి, ఉత్పాదకతలో మెరు గైన పద్ధతులను పాటిస్తున్నారు. 

తెలంగాణ స్టేజీ–1ను ప్రారంభిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ (ఫైల్‌)  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top