'తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలిపారు' | Rajinder criticized Congress | Sakshi
Sakshi News home page

'తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలిపారు'

Nov 26 2015 7:42 PM | Updated on Jul 11 2019 5:33 PM

వరంగల్ ఉప ఎన్నిక పై కామెంట్ చేసిన తెలంగాణ మంత్రి ఈటెల రాజేందర్.

వరంగల్ ఉప ఉన్నికలో ఓటర్లు మరోసారి తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలిపారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. గురువారం ఆయన కాజీపేట రైల్వే కోర్టుకు హాజరయ్యూరు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ నాయకులు ఎక్కడున్నారని ప్రశ్నించారు.

ఆయూ పార్టీల నాయకులకు సీఎం కేసీఆర్ గురించి, ఆయన పాలన గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా నమోదైన కేసులలో టీఆర్‌ఎస్ మంత్రుల్లా .. ప్రతిపక్షాలు ఎవరైనా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారా.. అని ప్రశ్నించారు. తమపార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా ఉద్యమంలో ప్రజలతో కలిసి రోడ్లపైనే గడిపామని చెప్పారు. ఉప ఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాటలకు ప్రజలు అసహ్యించు కున్నారని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement