
సాక్షి, హైదరాబాద్: ఉత్తర కర్ణాటక దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. వీటి ప్రభావంతో మంగళవారం, బుధవారం రాష్ట్రం లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో 10 సెం.మీ, అధిక వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్, గార్ల, రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలలో 9సెం.మీ, మణుగూరులో 8 సెం.మీ, డోర్నకల్‌లో 5 సెం.మీ, షాద్‌నగర్, కొందుర్గులలో 3 సెం.మీ చొప్పన వర్షపాతం నమోదైంది