ఆ పరిహారం వీసీ అప్పారావు సొత్తు కాదు | Radhika Vemula Slams VC Apparao | Sakshi
Sakshi News home page

ఆ పరిహారం వీసీ అప్పారావు సొత్తు కాదు

Feb 21 2018 2:15 AM | Updated on Jul 26 2019 5:38 PM

Radhika Vemula Slams VC Apparao - Sakshi

రోహిత్‌ వేముల తల్లి రాధికా వేముల

సాక్షి, హైదరాబాద్ ‌: జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ ఆదేశాలతో తన కుమారుడు రోహిత్‌ వేముల మృతికి పరిహారంగా సెంట్రల్‌ వర్సిటీ అందజేసిన రూ.8 లక్షలను తాను స్వీకరించినట్లు రోహిత్‌ తల్లి రాధిక వేముల మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. తమకు పరిహారంగా ఇచ్చిన డబ్బులు సెంట్రల్‌ యూనివర్సిటీ వీసీ పొదిలి అప్పారావు సొత్తు కాదని అన్నారు.

తన కుమారుడి ఆత్మహత్యకు కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టేవరకు ఆందోళన విరమించబోమని తెలిపారు. వీసీ అప్పారావు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కేంద్ర మాజీమంత్రి బండారు దత్తాత్రేయ తదితరులపై తాము చేపట్టిన న్యాయపోరాటాన్ని చివరివరకు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement