నటి రాధికా కుమారస్వామి రీ ఎంట్రీ | Radhika Kumaraswamy is back in action | Sakshi
Sakshi News home page

సినిమాల్లోకి మాజీ సీఎం భార్య రీ ఎంట్రీ

Jul 9 2017 8:18 AM | Updated on Sep 5 2017 3:38 PM

నటి రాధికా కుమారస్వామి రీ ఎంట్రీ

నటి రాధికా కుమారస్వామి రీ ఎంట్రీ

కన్నడ నటి రాధికా కుమారస్వామి సినీరంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చారు.

బెంగళూరు : కన్నడ నటి రాధికా కుమారస్వామి సినీరంగంలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రాధికా కుమారస్వామి..కన్నడ నటుడు రవిచంద్రన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న రాజేంద్రపొన్నప్ప అనే చిత్రంలో కథాయినాయికగా ఎంపికై ప్రేక్షకుల ముందుకు రానున్నారు.  దాదాపు పదకొండేళ్ల తరువాత రవిచంద్రన్, రాధికా కుమారస్వామిలు జంటగా  మళ్లీ తెరపైన కనిపించబోతున్నారు. రవిచంద్రన్‌ స్వతహాగా రాసిన కథతో ఈ చిత్రాన్ని నిర్మిస్తూ తానే దర్శకత్వం వహిస్తున్నారు.  ఈశ్వరి ప్రోడక్షన్‌ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌  త్వరలోనే ప్రారంభిచనున్నట్లు రవిచంద్రన్‌ తెలిపారు. ఛాయగ్రహకుడుగా జి.ఎస్‌.వి. సీతారామ్,  సంగీత దర్శకుడుగా గౌతమ్‌శ్రీవత్సవ్‌ సహకారం అందజేయనున్నారు.  

కాగా కర్నాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామిని రాధిక పెళ్లాడిన సంగతి తెలిసిందే. అప్పటికే పెళ్లయిన కుమార స్వామిని ఆమె రెండో వివాహం చేసుకున్నారు.  కుమారస్వామి గతంలో సినిమా రంగంలో నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా పని చేసిన   సమయంలో రాధికతో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తర్వాత ఇద్దరూ వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కూతురు కూడా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement