
సాక్షి, చెన్నూర్(మంచిర్యాల) : ఏరియాలోని కోల్‌బెల్ట్ రహదారి పక్కనే ఉన్న సింగరేణి గ్రీన్ పార్క్ వద్ద గురువారం సాయంత్రం కొండచిలువ హల్‌చల్ చేసింది. పార్క్ నుంచి బయటకు వచ్చిన ఆరడుగుల పొడువు గల కొండచిలువ వర్క్‌షాపు మూలమలుపు వద్ద రోడ్డుపైకి రావడంతో రాకపోకలు సాగించే వారు భయంతో ఆగిపోయారు. వాహనాల లైటింగ్‌కు తిరిగి పార్క్‌లోకి వెళ్లిపోయింది. కొండచిలువ తిరిగి పార్క్‌లోకి వెళ్లిపోవడంతో పట్టణ ప్రజలు భయపడుతున్నారు. రోజు సాయంత్రం సమయంలో వందలాది మంది కాలక్షేపానికి పార్క్‌కు వెళతారు. అధికారులు కొండ చిలువను పట్టుకోవాలని కోరుతున్నారు.