ఉన్మాది వీరంగం | psycho terror | Sakshi
Sakshi News home page

ఉన్మాది వీరంగం

Mar 9 2015 3:43 PM | Updated on Sep 2 2017 10:33 PM

ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో తాండూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఒక ఉన్మాది సోమవారం మధ్యాహ్నం వీరంగం సృష్టించాడు.

బెల్లంపల్లి (ఆదిలాబాద్ జిల్లా) : ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో తాండూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఒక ఉన్మాది సోమవారం మధ్యాహ్నం వీరంగం సృష్టించాడు. గొడ్డలి పట్టుకుని తిరుగుతూ.. కనిపించినవారిపై దాడిచేశాడు. ఉన్మాది స్వైరవిహారం చేయడంతో జనం భయంతో పరుగులు తీశారు. అతనికి అడ్డొచ్చిన ఇద్దరిని గొడ్డలితో నరకడంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

 


కాగా ఉన్మాదిని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.ఉన్మాది గొడ్డలితో దాడిచేసేందుకు తెగబడడంతో ప్రజలను హెచ్చరించిన పోలీసులు అతనిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement