రైతాంగానికి ఇబ్బంది లేకుండా పంటలకు 9 గంటల విద్యుత్‌ను ఒకేసారి సరఫరా చేయడానికి రాష్ట్రప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని, 2016 రబీ నుంచి వ్యవసాయూనికి...
గణపురం (వరంగల్ జిల్లా) : రైతాంగానికి ఇబ్బంది లేకుండా పంటలకు 9 గంటల విద్యుత్‌ను ఒకేసారి సరఫరా చేయడానికి రాష్ట్రప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసిందని, 2016 రబీ నుంచి వ్యవసాయూనికి 9గంటలపాటు విద్యుత్ సరఫరా చేసి మాట నిలుపుకుంటామని టీ జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు అన్నారు. వరంగల్ జిల్లా గణపురం మండలం చెల్పూరులోని కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ 600మెగావాట్ల రెండో దశ నిర్మాణపు పనులను పరిశీలించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 2016 నాటికి జెన్‌కోకు సుమారుగా 2వేల మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందన్నారు.
కేటీపీపీ రెండో దశ 600 మెగావాట్లు, సింగరేణికి చెందిన 1200 మెగావాట్లు లోయర్ జూరాల180 మెగావాట్లు, పులిచింతల 30 మెగావాట్ల విద్యుత్ జెన్‌కో ఖాతాలో జమ అవుతాయన్నారు. మరో మూడు సంవత్సరాలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తుందన్నారు. ఒక ప్రశృ్నకు సమాధానంగా 800మెగావాట్ల విద్యుత్ ప్లాంట్‌ను ప్రభుత్వం దామరచర్లకు తృరలించిందన్నారు. రానున్న రోజుల్లో కేటీపీపీకి మరో ప్లాంట్ తప్పకుండా వస్తుందన్నారు.