పాలకొల్లులో ఉద్రిక్తత | tension situation in palakollu | Sakshi
Sakshi News home page

పాలకొల్లులో ఉద్రిక్తత

Dec 24 2015 10:18 PM | Updated on Oct 1 2018 2:09 PM

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో గురువారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

పశ్చిమ గోదావరి: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో గురువారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పై టీడీపీకి చెందిన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు అధికార జులుం ప్రదర్శించారు. రబీ పంట నీటి కోసం గురువారం పలువురు రైతులు ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనలో ఎమ్మెల్సీ మేకా శేషుబాబుతో పాటూ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు.

అయితే ఏపీ సర్కార్ నిర్లక్ష్యం కారణంగానే రైతులకు సాగునీటి కష్టాలొచ్చాయని శేషుబాబు అన్నారు. ఈ వ్యాఖ్యలపై నిమ్మల రామానాయుడు ఆగ్రహంతో ఊగిపోయి రైతుల తరఫున ధర్నా చేస్తున్న మేకా శేషుబాబును పోలీసుల సాయంతో  దౌర్జన్యంగా  గెంటివేయించారు.

ఈ సంఘటనపై స్పందిస్తూ.. రైతులకు సాగునీరు ఇచ్చేంత వరకు ఆందోళన కొనసాగుతుందని మేకా శేషుబాబు పేర్కొన్నారు. అధికారంతో నిమ్మల రామానాయుడు విర్రవీగుతున్నారని మండిపడ్డారు. ఆయన అహంకారానికి ప్రజలే బుద్ధి చేబుతారని శేషుబాబు అన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement