నీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన | protest with Empty pots for water | Sakshi
Sakshi News home page

నీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన

Feb 9 2015 5:49 PM | Updated on Sep 2 2017 9:02 PM

జిన్నారం గ్రామ పంచాయతీ పరిధిలోని నర్రిగూడ గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి ఉందని, ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ సోమవారం గ్రామ మహిళలు, యువకులు ఆందోళన చేపట్టారు.

హైదరాబాద్: జిన్నారం గ్రామ పంచాయతీ పరిధిలోని నర్రిగూడ గ్రామంలో తీవ్ర నీటి ఎద్దడి ఉందని, ఈ సమస్యను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ సోమవారం గ్రామ మహిళలు, యువకులు ఆందోళన చేపట్టారు. ఖాళీబిందెలతో తమ నిరసనని తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ తమ గ్రామంలో నీటి సమస్య తీవ్రంగా ఉన్నా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవటం లేదన్నారు. రెండేళ్లుగా ఈ సమస్య ఉందని, ప్రతినిత్యం బోరుమోటరు చెడిపోతుండటంతో నీటిసమస్య తలెత్తుతుందన్నారు. మోటారును బాగుచేయించే వారే లేకుండా పోయారన్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా లాభం లేకుండా పోయిందన్నారు. సత్వరమే గ్రామంలోని నీటి సమస్యను పరిష్కరించే విధంగా ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement