తెలంగాణ జైళ్ల శాఖలో పదోన్నతులు | promotions in telangana Prisons Department | Sakshi
Sakshi News home page

తెలంగాణ జైళ్ల శాఖలో పదోన్నతులు

Aug 27 2017 7:28 PM | Updated on Sep 12 2017 1:07 AM

తెలంగాణ జైళ్ల శాఖలో ముగ్గురు అధికారులకు పదోన్నతులు లభించాయి.

హైదరాబాద్‌: తెలంగాణ జైళ్ల శాఖలో ముగ్గురు అధికారులకు పదోన్నతులు లభించాయి. చంచల్‌గూడ జైలు పర్యవేక్షణ అధికారి సైదయ్యకు హైదరాబాద్ రేంజ్ డీఐజీగా, చర్లపల్లి జైలు ఇన్‌చార్జి పర్యవేక్షణ అధికారి ఎం.ఆర్‌.భాస్కర్‌కు పూర్తిస్థాయి పర్యవేక్షణ అధికారిగా పదోన్నతి లభించింది. అలాగే సికా ప్రిన్సిపాల్ మురళిబాబును చర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం జైలు పర్యవేక్షణ అధికారిగా ప్రభుత్వం నియమించింది. ఈ పదోన్నతులపై అధికారికంగా నాలుగు రోజుల్లో ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement