బస్టాండ్‌లో ప్రసవం | Pregnant woman deliver in busstand | Sakshi
Sakshi News home page

బస్టాండ్‌లో ప్రసవం

Mar 3 2018 9:53 AM | Updated on Mar 3 2018 9:53 AM

Pregnant woman deliver in busstand - Sakshi

108 వాహనంలో రజితను తరలిస్తున్న దృశ్యం, శిశువుకు టీకా వేస్తున్న సిబ్బంది

వరంగల్‌, కాశిబుగ్గ: నెలలు నిండడంతో డెలివరీ కోసం ఆస్పత్రికి వెళ్లడానికి  బస్సులో వచ్చిన గర్భిణి బస్టాండ్‌లోనే ప్రసవించింది. వరంగల్‌ రూరల్‌ జిల్లా చింతనెక్కొండకు చెందిన బట్టు నరేష్‌ భార్య శైలజ గర్భిణి. ప్రతి నెలా సీకేఎం ఆస్పత్రిలో వైద్యం చేయించుకుంటోంది. ఫిబ్రవరిలోనే నెలలు నిండాయని, చివరి వారంలో ఆస్పత్రిలో అడ్మిట్‌ కావాలని డాక్టర్లు సూచించారు. సమయం దాటిపోయిందని గుర్తించిన రజిత అత్తమ్మను వెంట తీసుకుని బస్సులో వరంగల్‌ సీకేఎం ఆస్పత్రికి బయలుదేరింది. బస్టాండ్‌లో బస్సుదిగి ప్లాట్‌ఫామ్‌ మీదకు చేరుకోగానే నడవలేక అక్కడే కూర్చుంది. నొప్పులు ఎక్కువై అక్కడే ప్రసవించింది. గమనించిన ప్రయాణికులు 108 సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి ప్రాథమిక వైద్యం చేసి సీకేం ఆస్పత్రికి తరలించారు. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement