కేటీపీపీలో నిలిచిన విద్యుత్‌ ఉత్పత్తి | power generation placed in technical problems | Sakshi
Sakshi News home page

కేటీపీపీలో నిలిచిన విద్యుత్‌ ఉత్పత్తి

Mar 8 2017 4:44 PM | Updated on Sep 5 2017 5:33 AM

కేటీపీపీలో నిలిచిన విద్యుత్‌ ఉత్పత్తి

కేటీపీపీలో నిలిచిన విద్యుత్‌ ఉత్పత్తి

జయశంకర్‌ జిల్లా గణపురం మండలం చెల్పూరులోని కాకతీయ థర్మల్‌ విద్యుత్తు ప్లాంట్‌(కేటీపీపీ)లో విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది.

గణపురం: జయశంకర్‌ జిల్లా గణపురం మండలం చెల్పూరులోని కాకతీయ థర్మల్‌ విద్యుత్తు ప్లాంట్‌(కేటీపీపీ)లో విద్యుత్తు ఉత్పత్తి నిలిచిపోయింది. 600 మెగావాట్ల రెండో దశ విద్యుత్తు కేంద్రంలో బాయిలర్‌ లీకేజీ వల్ల ఉత్పత్తి నిలిచిపోయినట్లు చీఫ్‌ ఇంజినీర్‌ మహేష్‌కుమార్‌ తెలిపారు. రెండు రోజుల్లో మరమ్మతులు చేసి ప్లాంట్‌ను పునఃప్రారంభిస్తామన్నారు. రోజుకు రూ.32లక్షల విలువైన విద్యుత్తు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని ఆయన పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement