కోర్టు ముందుకు పోస్టుమార్టం నివేదిక | Post-mortem report to the court | Sakshi
Sakshi News home page

కోర్టు ముందుకు పోస్టుమార్టం నివేదిక

Published Sat, Dec 23 2017 3:24 AM | Last Updated on Fri, Aug 31 2018 8:34 PM

Post-mortem report to the court - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మేళ్లమడుగు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన 9 మంది సీపీఐ(ఎంఎల్‌) చండ్ర పుల్లారెడ్డి బాట దళ సభ్యుల మృతదేహాలకు నిర్వహించిన పోస్టుమార్టం తాలుకు నివేదికను, సీడీలను ప్రభుత్వం శుక్రవారం హైకోర్టు ముందుంచింది. ఈ ఘటనపై పిటిషనర్‌ కోర్టు పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని కోరుతున్న నేపథ్యంలో, పూర్తి వివరాలను కౌంటర్‌ రూపంలో తమ ముందుంచాలని ప్రభు త్వాన్ని ఆదేశించింది. ఈ కౌంటర్‌ను పరిశీలించిన తర్వాత దర్యాప్తుపై ఓ నిర్ణయం తీసుకుంటామంది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.

ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది బూటకపు ఎన్‌కౌంటర్‌ అని, దీనిపై సీబీఐ లేదా సిట్‌తో దర్యాప్తు చేయించి, ఆ దర్యాప్తును పర్యవేక్షించాలని అభ్యర్ధిస్తూ పౌర హక్కుల కమిటీ అధ్యక్షుడు జి.లక్ష్మణ్‌ హైకోర్టులో పిల్‌ వేసిన విషయం తెలిసిందే. దీనిపై ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ జరిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement