
'మైనార్టీలను వర్గాలుగా విభజిస్తున్న ప్రభుత్వం'
కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలపై అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు.
హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వర్గాలపై అనుసరిస్తున్న వైఖరిపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్లో పొన్నం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బీసీలకు సంక్షేమ పథకాలు సరిగ్గా అందడం లేదని ఆరోపించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలను వర్గాలుగా విభజించి పాలిస్తోందని విమర్శించారు. వాటి నిధుల కేటాయింపు, జీవోల జారీ, వాటి అమలుపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.