రైతుల ఉసురు పోసుకుంటున్న కేసీఆర్‌ | ponnam prabhakar fired on cm kcr | Sakshi
Sakshi News home page

రైతుల ఉసురు పోసుకుంటున్న కేసీఆర్‌

Apr 2 2017 2:52 AM | Updated on Aug 14 2018 11:02 AM

రైతుల ఉసురు పోసుకుంటున్న కేసీఆర్‌ - Sakshi

రైతుల ఉసురు పోసుకుంటున్న కేసీఆర్‌

వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు రైతుల ఉసురు తగులుతుందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు.

మాజీ ఎంపీ పొన్నం ఫైర్‌...
సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేస్తున్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు రైతుల ఉసురు తగులుతుందని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆరోపించారు. శనివారం గాంధీభవన్‌లో ఆయన విలేకరులతోమాట్లాడుతూ.. ప్రభుత్వం జీవో 182తో విత్తనాల ధరలను 40 శాతం పెంచిం దన్నారు. విత్తనాల కంపెనీలతో ప్రభుత్వం కుమ్మౖక్కైదన్నారు. మద్దతు ధర పెంచకుండా విత్తనాల ధరలు పెంచడం దారుణమన్నారు. విత్తనచట్టాన్ని ఎందుకు పక్కన పెట్టిందని ప్రశ్నించారు.

సీఎం కేసీఆర్‌ చెప్పిన మార్కెట్‌ స్థిరీకరణ నిధి ఎక్కడికి పోయిందన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు పెరిగితే పాలాభిషేకాలు చేసుకుంటున్న కేసీఆర్‌ మరి దిగుబడి తగ్గితేవర్గాలే కారణం అనడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రభుత్వాన్ని రైతులే రాళ్లతో కొట్టే రోజు త్వరలోనే ఉందని హెచ్చరించారు. రైతుల కోసం క్షేత్ర స్థాయిలో కాంగ్రెస్‌ పోరాడుతుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement