
కేసీఆర్ మానసికస్థితి బాగాలేదేమో: పొన్నాల
టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు చెప్పే మాటలను ప్రజలు ఎంతమాత్రమూ నమ్మరని, ఆయన చెప్పేవన్నీ వినడానికి బాగున్నా..ఆచరణ సాధ్యం కానివని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు.
జనగామ, న్యూస్‌లైన్: టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు చెప్పే మాటలను ప్రజలు ఎంతమాత్రమూ నమ్మరని, ఆయన చెప్పేవన్నీ వినడానికి బాగున్నా..ఆచరణ సాధ్యం కానివని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. వరంగల్ జిల్లా జనగామలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌లో చీలికలు తెచ్చేందుకు తాను ప్రయత్నిస్తున్నానని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను కొట్టిపారేశారు. ఆయన మానసిక పరిస్థితి బాగా లేదన్న విషయం బయటపడుతుందని చెప్పారు.
ప్రతినియోజకవర్గంలో లక్ష ఎకరాల భూమి లేకున్నా.. లక్ష ఎకరాలకు సాగునీరందిస్తామని, దళిత కుటుంబాలకు మూడెకరాల భూ పంపిణీ, మైనార్టీలు, గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామంటూ సాధ్యంకాని విషయాలు చెబుతున్నారని విమర్శించారు.ప్రజలను మభ్యపెట్టేందుకో లేక అవగాహన లేకనో చెప్పాలని పొన్నాల డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభులత్వం ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తాము అధికారంలోకి వస్తే తెలంగాణ ఉద్యోగులు చేసిన ప్రతిపాదనలనే జీవోలుగా మారుస్తామన్నారు.