అమరుల కుటుంబాలను ఆదుకుంటాం | Police Commemoration Day | Sakshi
Sakshi News home page

అమరుల కుటుంబాలను ఆదుకుంటాం

Oct 21 2017 7:14 PM | Updated on Oct 17 2018 6:06 PM

Police Commemoration Day  - Sakshi

నిజామాబాద్‌ : విధి నిర్వహణలో ప్రాణా లు కోల్పోయిన పోలీస్‌ కుటుంబాలకు పోలీస్‌ శాఖ అండగా ఉంటుందని ఎన్‌ఐబీ ఏసీపీ రవీందర్‌ తెలిపారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారో త్సవాల సందర్భంగా శుక్రవారం పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయం సమావేశం హాల్‌లో అమర పోలీస్‌వీరుల కుటుంబా ల సభ్యులతో ఏసీపీ సమావేశమయ్యా రు. అమరులైన పోలీస్‌ కుటుంబాలకు అందిన, అందాల్సిన సంక్షేమ సహాయ కార్యక్రమాలపై చర్చించారు.

 ఏసీపీ రవీందర్‌ అమరవీరులైన కుటుంబ సభ్యులను సమస్యలు, బాగోగులను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలపై సత్వర చర్యలకు ఉత్తర్వులు జారీ చేశారు. అమరులైన పోలీస్‌ కుటుంబాలకు అధికారులు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని వారి బాగోగులు పర్యవేక్షించాలని తెలిపారు. స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ సిహెచ్‌ వెంకన్న, ఆఫీస్‌ సూపరింటెండెంట్‌ మక్సూద్‌ హైమద్, జనార్దన్, డీపీవో సిబ్బంది పాల్గొన్నారు.

అండగా ఉంటాం..
డిచ్‌పల్లి: పోలీసు అమరవీరుల కుటుంబాలకు అన్ని విధాల అండగా ఉం టా మని టీఎస్‌ఎస్‌పీ ఏడో బెటాలియన్, డిచ్‌పల్లి కమాండెంట్‌ ఎన్‌వీసాంబయ్య అన్నారు. శుక్రవారం తన ఛాంబర్‌లో అమరవీరుల కుటుంబాల సభ్యులతో సమావేశం నిర్వహించి మాట్లాడారు. అమరుల కుటుంబాలకు ప్రభుత్వపరం గా ఆర్థికపరమైన అన్ని రకాల ప్రయోజనాలు అందజేశారు. డిచ్‌పల్లి మండలం నడిపల్లి గ్రామ శివారులో ఇంటి నిర్మా ణం కోసం ఒక్కొక్క కుటుంబానికి 300 గజాల స్థలం ఇచ్చారని తెలిపారు.

అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చామన్నారు. గతంలో తమ కుటుంబాలకు తక్కువ మొత్తంలో పరిహారం చెల్లించిం దని, రూ.5లక్షల ఎక్స్‌గ్రేషియా ఇచ్చేలా చూడాలని అమర కుటుంబాల సభ్యులు కోరారు. అలాగే డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు మంజూరు చేయాలని కోరారు. అడిషనల్‌ కమాండెంట్‌ రాజీవ్‌కుమార్, అసిస్టెంట్‌ కమాండెంట్స్‌ ప్రసన్నకుమార్, దేవిదాస్‌రాథోడ్, రమణ, బీడబ్లు్యవో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement