హుండీ ఎత్తుకెళ్లిన దొంగల అరెస్ట్‌ | Police Arrested Gang Who Theft Hundi In Sarangapur Nizamabad | Sakshi
Sakshi News home page

హుండీ ఎత్తుకెళ్లిన దొంగల అరెస్ట్‌

Jul 29 2019 8:15 PM | Updated on Jul 29 2019 8:55 PM

Police Arrested Gang Who Theft Hundi In Sarangapur Nizamabad - Sakshi

సాక్షి, నిజామాబాద్: కొద్ది రోజుల క్రితం జిల్లాలోని సారంగపూర్ ఆలయంలో జరిగిన చోరీ కేసును ఎట్టకేలకు పోలీసులు చేధించారు. దొంగతనానికి పాల్పడిన ముగ్గురు వ్యక్తులను సోమవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్‌ పోలీసు కమిషనర్‌ కార్తికేయ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. చోరీకి పాల్పడ్డ నిందితులను లింగం, రమేశ్‌, నరేశ్‌లుగా గుర్తించారు. వీరు పాత నేరస్థులేనని తెలిపారు. కాగా వీరి దగ్గరి నుంచి రూ.1,02,450 హుండీ డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement