బస్సులపై రాళ్లు రువ్విన 9మంది అరెస్ట్ | Police arrest 9 for throwing stones at buses | Sakshi
Sakshi News home page

బస్సులపై రాళ్లు రువ్విన 9మంది అరెస్ట్

Dec 11 2015 8:17 PM | Updated on Sep 3 2017 1:50 PM

ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ సందర్భంగా జరిగిన ఘర్షణలో ఆర్టీసీ బస్సులపైకి రాళ్లు రువ్విన అల్లరిమూకను పోలీసులు గుర్తించారు.

హైదరాబాద్ : ఉస్మానియా యూనివర్సిటీలో బీఫ్ ఫెస్టివల్ సందర్భంగా జరిగిన ఘర్షణలో ఆర్టీసీ బస్సులపైకి రాళ్లు రువ్విన అల్లరిమూకను పోలీసులు గుర్తించారు. ఓయూలోకి అనుమతించాలని గురువారం హిందూవాహిని, బజరంగ్‌దళ్ సభ్యులు ఎన్‌సీసీ గేటు వద్ద ఆందోళనకు దిగిన సందర్భంలో పోలీసులు వాళ్లను అనుమతించకుండా గేటు బయట అడ్డుకున్నారు. దీంతో కోపోద్రిక్తులైన కార్యకర్తలు ఆర్టీసీ బస్సులపైకి రాళ్లు రువ్వారు. దీంతో రెండు బస్సుల అద్దాలు పగలడంతో పాటు డ్రైవర్‌లకు గాయాలయ్యాయి. సీసీ టీవీల ఫూటేజి ఆధారంగా నిందితులను గుర్తించిన చిక్కడపల్లి పోలీసులు రాళ్లు రువ్విన 9 మందిని శుక్రవారం అరెస్ట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement