పెట్రో బాంబు | petrol , diesel prices are increased | Sakshi
Sakshi News home page

పెట్రో బాంబు

Jul 1 2014 3:54 AM | Updated on Sep 28 2018 3:22 PM

పెట్రో బాంబు - Sakshi

పెట్రో బాంబు

కేంద్ర ప్రభుత్వం పెట్రో బాంబు పేల్చింది. పెట్రోల్, డీజి ల్ ధరలు పెంచి వినియోగదారు ల నడ్డి విరిచింది. ఇటీవల రైల్వే చార్జీలు పెంచిన కేంద్రం పది రోజుల్లోనే పెట్రో చార్జీలు పెంచడంతో జనం ఆందోళన చెందుతున్నారు.

ఆదిలాబాద్ టౌన్ : కేంద్ర ప్రభుత్వం పెట్రో బాంబు పేల్చింది. పెట్రోల్, డీజి ల్ ధరలు పెంచి వినియోగదారు ల నడ్డి విరిచింది. ఇటీవల రైల్వే చార్జీలు పెంచిన కేంద్రం పది రోజుల్లోనే పెట్రో చార్జీలు పెంచడంతో జనం ఆందోళన చెందుతున్నారు. పెరిగిన ధరలు సో మవారం అర్ధరాత్రి నుంచే అ మలుల్లోకి వచ్చాయి. ఈ చార్జీల పెంపుతో నిత్యావసర సరుకుల, వాహన చార్జీల ధరలు పెరిగే అవకాశం ఉంది. పెరిగిన డీజిల్ ధరతో ఆర్టీసీపై పెనుభారం పడనుంది.

వినియోగదారునిపై అదనపు భారం
జిల్లాలో దాదాపు 100పైగా పెట్రోల్ బంకులు ఉన్నాయి. పెట్రోల్ రోజుకు 80 వేల లీటర్ల విక్రయం జరుగుతుంది. డీజిల్ రోజుకు 2.20 లక్షల లీటర్ల అమ్మకం జరుగుతుంది. పెరగక ముందు పెట్రోల్ ధర రూ.78.88 ఉండగా, రూ.1.69 పైసలు పెరగడంతో రూ.80.57కు చేరింది. కాగా రోజుకు వినియోగదారునిపై రూ. 1.52 లక్షల అదనపు భారం పడనుంది. అదేవిధంగా డీజిల్ జిల్లాలో 2.20 లక్షల విక్రయం జరుగుతుంది. పెరగ ముందు డీజిల్ ధర రూ.63.50 ఉండగా 50 పైసలు పెరగడంతో రూ.63.02 పైసలకు చేరింది. రోజుకు వాహనాదారుపై రూ.1.10 లక్షల భారం పడనుంది. పెట్రోల్‌పై నెలకు రూ.45.60 లక్షలు, డీజిల్‌పై రూ.33 లక్షల భారం పడనుంది. పెట్రోల్, డీజిల్ చార్జీలు పెరగడంతో ప్రజల్లో ఆగ్రహం పెల్లుబిక్కుతుంది. ఈ ప్రభావం సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజలపై పడనుంది. ప్రతిపక్షాలు ఆందోళనలకు సిద్ధమవుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement