ఖండాంతరాల్లో పెంబర్తి కళాఖండాలు
హస్త కళలకు పుట్టినిల్లయిన వరంగల్ జిల్లా పెంబర్తి కళా వైభవం ఖండాంతరాలు దాటి వెళుతోంది.
♦ అమెరికాలోని రెస్టారెంట్‌కు పెంబర్తి కళాఖండాలు
♦ 250 కిలోల ఇత్తడితో ముఖద్వారం
♦ నేడు అమెరికాకు తరలనున్న కళారూపాలు
జనగామ: హస్త కళలకు పుట్టినిల్లయిన వరంగల్ జిల్లా పెంబర్తి కళా వైభవం ఖండాంతరాలు దాటి వెళుతోంది. ప్రపంచానికి పెద్దన్నగా చెప్పుకునే అమెరికాలోనూ ఇక్కడి కళాఖండాలకు ఘనకీర్తి దక్కుతోంది. ఇక్కడ తయారైన ఇత్తడి కళాఖండాలు అమెరికాలోని ఓ రెస్టారెంట్‌లో అలరించనున్నాయి. హైదరాబాద్ దుర్గాభాయ్ దేశ్‌ముఖ్ కాలనీకి చెందిన కొమ్మిడి బల్వంతరెడ్డి అమెరికాలో స్థిరపడ్డారు. ఆయన న్యూజెర్సీలో మొఘల్ దర్బార్ రెస్టారెంట్‌ను నెలకొల్పుతున్నారు. ఈ రెస్టారెంట్ ముఖ ద్వారం, కాన్ఫరెన్స్ హాల్, భోజనశాలతో పాటు ఇంటీరియల్ డిజైన్లను పెంబర్తిలో తయారు చేయిస్తున్నారు.
సుమారు రూ.7 లక్షల విలువైన 250 కిలోల ఇత్తడితో ఈ కళాఖండాలు రూపుదిద్దుకుంటున్నాయి. రెస్టారెంట్ ముఖద్వారంపై ‘మొఘల్ దర్బార్ హోటల్’ అని తెలుగులో రాయిస్తూ మాతృభాషపై తనకున్న మమకారాన్ని చాటుకున్నారు. ఇక్కడ తయూరైన కళాఖండాలు గురువారం అమెరికా వెళ్లనున్నారుు. కాగా, పదేళ్ల క్రితం హైదరాబాద్‌కు చెందిన మరో ఎన్‌ఆర్‌ఐ సంపత్‌రెడ్డి టెక్సాస్‌లో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర ఆలయ ముఖద్వారం, ధ్వజస్తంభాల రేకులను కూడా పెంబర్తిలోనే తయారు చేరుుంచి తీసుకెళ్లారు. ముఖద్వారం కోసం రూ.5 ల క్షలతో తీర్చిదిద్దిన తలుపులను స్టీమర్ ద్వారా పంపించారు.
అమెరికా ఆర్డర్లు రావడం ఆనందంగా ఉంది
కళాఖండాల తయారీ కోసం అమెరికా నుంచి ఆర్డర్లు రావడం ఆనందంగా ఉంది. అమెరికా, జపాన్, ఇటలీ లాంటి ఎన్నో దేశాలకు ఇక్కడ తయారు చేసిన వాటిని తీసుకెళ్తున్నారు. మేము ఐదుగురు అన్నదమ్ముల(జనార్ధనాచారి, సోమశేఖర్, వేదంతాచారి, నాగరాజు, నవీన్)తో పాటు ప్రైవేటు కార్మికుడు బాలగాని ప్రభాకర్ కలిసి మొఘల్ దర్భార్ హోటల్ కోసం 15 రోజుల్లో డిజైన్లు తయారు చేశాం. సుమారు రూ.లక్ష వరకు సంపాదించుకోగలిగాం.
-మల్యాల జనార్ధనాచారి, హస్త కళాకారుడు


