హైదరాబాద్ నగరంలో ప్రసూతి సేవలకు కీలకమైన కోటి మెటర్నిటీ ఆస్పత్రిలో విద్యుత్ లేక చికిత్స కోసం వచ్చిన వారు 8 గంటల పాటు నానా యాతన పడ్డారు.
హైదరాబాద్: నగరంలో ప్రసూతి సేవలకు కీలకమైన కోటి మెటర్నిటీ ఆస్పత్రిలో విద్యుత్ లేక చికిత్స కోసం వచ్చిన వారు 8 గంటల పాటు నానా యాతన పడ్డారు. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఆస్పత్రి వద్ద ట్రాన్స్‌ఫార్మర్‌లో మంటలు చెలరేగడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ప్రత్యామ్నాయంగా ఆస్పత్రిలో జనరేటర్ ఉన్నప్పటికీ అది పనిచేయడం లేదు.
సిబ్బంది సకాలంలో స్పందించకపోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గర్భిణులు, బాలింతలు, శిశువులు అవస్థలు పడ్డారు. ఆస్పత్రి సిబ్బంది జనరేటర్‌కు మరమ్మతులు చేయించి ఎట్టకేలకురాత్రి 9 గంటలకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.