నంగునూరు/మెదక్ టౌన్: తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ మెదక్ జిల్లాలో గురువారం నుంచి ఐదు రోజులపాటు జరుగుతుందని, ఇందుకోసం రాజగోపాల్‌పేట పాలిటెక్నిక్ కళాశాలలో...
కౌన్సెలింగ్ ర్యాంక్‌ల వివరాలు
= 25వ తేదీ: 9 గంటలకు 1వ ర్యాంక్ నుంచి
7,000 వరకు, మధ్యాహ్నం నుంచి 7,001 నుంచి 14,000 వరకు
= 26వ తేదీ: ఉదయం 14,001 నుంచి 21,000 వరకు, మధ్యాహ్నం 21,001 నుంచి 28,000 వరకు
= 27వ తేదీ: ఉదయం 28,001 నుంచి 35,000 వరకు, మధ్యాహ్నం 42,000 వరకు
= 28వ తేదీ: ఉదయం 42,001 నుంచి 49,000 వరకు, మధ్యాహ్నం 49,001 నుంచి 56,000 వరకు
= 29వ తేదీ: ఉదయం 56,001 నుంచి 63,000 వరకు, మధ్యాహ్నం 63,001 నుంచి చివరి ర్యాంక్ వరకు కౌన్సెలింగ్
నిర్వహిస్తారు.
నంగునూరు/మెదక్ టౌన్: తెలంగాణ పాలిసెట్ కౌన్సెలింగ్ మెదక్ జిల్లాలో గురువారం నుంచి ఐదు రోజులపాటు జరుగుతుందని, ఇందుకోసం రాజగోపాల్‌పేట పాలిటెక్నిక్ కళాశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రిన్సిపాల్ నాగేశ్వర్‌రావు తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎస్టీ, స్పోర్ట్స్, ఎన్‌సీసీ, క్యాప్ అభ్యర్థులకు హైదరాబాద్‌లో కౌన్సెలింగ్ జరుగుతుందన్నారు. ఓసీ, బీసీ, ఎస్సీ అభ్యర్థులకు ర్యాంక్‌ల ఆధారంగా రాజగోపాల్‌పేటలో కౌన్సెలింగ్ నిర్వహిస్తారన్నారు.
కౌన్సెలింగ్ కు హాజరయ్యే విద్యార్థులు హల్‌టికెట్, ర్యాంక్ కార్డు, ఎస్సెస్సీ మెమో, టీసీ, 1 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్, 2015 జనవరి 1 తర్వాత మీసేవ నుంచి పొందిన ఆదాయ, కుల, నివాస ధ్రువీకరణ పత్రాలు వెంట తెచ్చుకోవాలన్నారు. కౌన్సెలింగ్ అనంతరం ఓసీ, బీసీ అభ్యర్థులు రూ 300, ఎస్టీలు రూ.150 చొప్పున ఫీజు చెల్లించాలన్నారు. కాగా, జిల్లాలో పాలిటెక్నిక్ కౌన్సెలింగ్‌కు సర్వం సిద్ధం చేసినట్టు కౌన్సెలింగ్ కోఆర్డినేటర్ రాజేంద్రప్రసాద్ తెలిపారు.
వెబ్ ఆప్షన్ సదుపాయం
పాలిసెట్ కౌన్సెలింగ్ పూర్తయిన అభ్యర్థులకు రాజగోపాల్‌పేటలో వెబ్‌ఆప్షన్ పెట్టుకొనే సదుపాయం కల్పించామని ప్రిన్సిపాల్ తెలిపారు. 28వ తేదీ నుంచి 29 వరకు 1వ ర్యాంక్ నుంచి 35,000 ర్యాంక్ వరకు, 30 నుంచి జూలై 1 వరకు 35,001 నుంచి చివరి ర్యాంక్ వరకు వెబ్ ఆప్షన్ పెట్టుకోవచ్చాన్నారు. 2వ తేదీన ఆప్షన్ మార్చుకునే వారి కోసం సదుపాయం కల్పించామన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలు, సందేహాలకు 7660009753, 9010222189 ఫోన్ నంబర్లలో సంప్రదించాలన్నారు.