పాలేరు నియోజకవర్గ ప్రజలు ఉప ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు హర్షనీయమని మండల టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి....
కొడకండ్ల : పాలేరు నియోజకవర్గ ప్రజలు ఉప ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు హర్షనీయమని మండల టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి సల్దండి సుధాకర్ అన్నారు. మండలకేంద్రంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావును భారీ మేజార్టీతో గెలిపించిన అక్కడి ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో టీఆర్‌ఎస్ నాయకులు లింగాల రమేష్, బొమ్మరబోయిన రాజుయాదవ్, వెంకన్న, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.