కాంగ్రెస్‌కు పట్టం కడితే రూ.2లక్షల రుణమాఫీ

Over 2 lakh farmers  of loan waiver scheme - Sakshi

మాజీ చీఫ్‌విప్‌ గండ్ర వెంకటరమణరెడ్డి

చిట్యాల : రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు పట్టం కడితే ఏక కాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని, అలాగే నిరుద్యోగులకు నెలకు రూ.3వేల చొప్పున జీవన భృతి చెల్లిస్తామని మాజీ చీఫ్‌విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. 350 కిలోమీటర్లు రైతు భరోసాయాత్ర పూర్తిచేసుకున్న సందర్భంగా శుక్రవారం రాత్రి చిట్యాలలో గండ్ర కేక్‌కట్‌ చేశారు. శనివారం ఉదయం వెంకట్రావుపల్లి(సి), తిర్మాలాపూర్, గుంటూరుపల్లి, జూకల్లు, చల్లగరిగె, ముచినిపర్తి గ్రామాల్లో పాదయాత్ర నిర్వహించారు. ప్రజలు గండ్ర దంపతులకు ఘన స్వాగతం పలికి ఈ సందర్భంగా మండల అధ్యక్షులు గొర్రె సాగర్‌ అధ్యక్షతన జరిగిన రోడ్డుషోలో గండ్ర మాట్లాడుతూ మహిళాసంఘాలకు రూ.లక్ష వడీ లేని రుణాలు ఇస్తామని, రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర చెల్లించి ఆదుకుంటామన్నారు.

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కు మార్‌రెడ్డి ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటిస్తారని తెలిపారు. రైతులు ధైర్యంగా ఉండాలని కోరారు. అన్ని వర్గాల ప్రజలకు కాంగ్రెస్‌ అండగా ఉంటుందని భరోసా నిచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకురాలు గండ్ర జ్యోతి, జిల్లా, మండల నాయకులు వీసం సురేందర్‌రెడ్డి, హరిబాబు, చల్లూరి సమ్మ య్య, పెరుమాండ్ల రవీందర్, పర్లపల్లి భద్రయ్య, పాండ్రాల స్వామి, లాండె సాంబశివరావు, తిరుపతి,కుమార్, పిట్ట సురేషబాబు,సదానందం, తౌటం సుదర్శన్, భద్రయ్య, కర్రె పురేందర్‌రెడ్డి, ఏరుకొండ అయిలయ్య, ఎల్లయ్య, దామెర రాజు, కొంక అప్పారావు, శ్రీమన్నారాయణ, మహేందర్, స్వామిదాసు, అనిల్‌కుమార్, బుర్ర రాజు, నర్సయ్య, సమ్మయ్య, మేకల సాంబయ్య, సంపత్‌కుమార్, రవి, మూల రమేష్‌ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top