తెలంగాణవారికే ఇళ్ల స్థలాలు! | Sakshi
Sakshi News home page

తెలంగాణవారికే ఇళ్ల స్థలాలు!

Published Sat, Sep 6 2014 2:27 AM

తెలంగాణవారికే ఇళ్ల స్థలాలు!

ప్రజాప్రతినిధులు,ఐఏఎస్, జర్నలిస్టుల కేసులో సీఎం కేసీఆర్ యోచన
 
హైదరాబాద్: ప్రజాప్రతినిధు లు, ఐఏఎస్, ఐపీఎస్, జర్నలిస్టులకు హైదరాబాద్‌లో ఇళ్లస్థలాల విషయం పై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు.  వచ్చేవారం సుప్రీంకోర్టు దీనిపై స్పష్టతనిచ్చే అవకాశమున్నందున నిర్ణయం తీసుకోవాలని ఆయన భావిస్తున్నారు. ఈ కేసు వివరాలను ఇవ్వాలని రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శికి సీఎం కార్యాలయం నుండి ఆదేశాలు అందాయి. తెలంగాణ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, జర్నలిస్టులకే ఈ ఇళ్లస్థలాలు చెందే విధంగా ప్రతిపాదనలను, వాదనలను తయారు చేయాలని సూచించినట్టు తెలుస్తోంది. సమైక్య రాష్ట్రంలోని పాత కేటాయింపులను రద్దు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. అయితే ఇప్పటికే ఆ సొసైటీలు ప్రభుత్వానికి చెల్లించిన డబ్బును తిరిగి ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. దీనికి సంబంధించి న్యాయ సలహా లను కోరుతున్నట్లు తెలిసింది.

జర్నలిస్టులందరికీ హెల్త్‌కార్డులు ఇవ్వాలి

జర్నలిస్టులందరికీ హెల్త్‌కార్డులివ్వాలని టీయూ డబ్ల్యూజే అధ్యక్ష ప్రధానకార్యదర్శులు శేఖర్, కె.విరాహత్‌అలీ ఒక ప్రకటనలో సీఎం కేసీ ఆర్‌ను కోరారు. ప్రెస్ అకాడమీకి సంక్షేమ బాధ్యతలు అప్పగించొద్దని పేర్కొన్నారు

Advertisement
Advertisement