ఇసుక అక్రమ రవాణాపై కొరడా | Sakshi
Sakshi News home page

ఇసుక అక్రమ రవాణాపై కొరడా

Published Sun, Feb 7 2016 1:41 AM

ఇసుక అక్రమ రవాణాపై   కొరడా

 రాజీవ్ రహదారిపై తనిఖీలు ముమ్మరంపలువురిపై కేసులు నమోదు

 గజ్వేల్/వర్గల్: కరీంనగర్ నుంచి మెదక్ జిల్లా మీదుగా రాజీవ్ రహదారిపై ఓవర్‌లోడ్‌తో, వేబిల్లుల్లేకుండా సాగిస్తున్న ఇసుక రవాణాపై అధికారులు కొరడా ఝలిపించారు. ‘రహదారే అడ్డా’ శీర్షిక న ఈ నెల 4న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో తనిఖీలను ముమ్మరం చేశారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వరకు 170 కిలోమీటర్ల పొడవునా నిఘా ఉంచి ఓవర్‌లోడు, వేబిల్లులతో ప్రమేయం లేకుండా వస్తున్న ఇసుక లారీలను పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు.

మూడు రోజులుగా ఈ ప్రక్రియ సాగుతోంది. తాజాగా శనివారం కరీంనగర్ నుంచి రాజీవ్ రహదారి మీదుగా ఇసుకను తరలిస్తున్న 3 లారీలను వర్గల్ మండలం గౌరారం పోలీసులు పట్టుకున్నారు. సదరు లారీల కాగితాలను పరిశీలించగా వేబిల్లులు లేకుండా ఇసుకను తరలిస్తున్నట్లు తేలింది. దీంతో ఆ లారీల డ్రైవర్లు షేక్ ఎజాజ్, రాంజీ, లింగారెడ్డి, ఓనర్లు రంగారెడ్డి, లింగం, మహ్మద్ ఇఫ్తకార్ అహ్మద్‌లపై గనులు, భూగర్భ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు గౌరారం ఎస్‌ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఇసుక లారీలను సీజ్ చేసి కోర్టులో అప్పగిస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement
Advertisement