‘అమరుల త్యాగం మరువలేనిది’

obituary tribute to mahatma gandhi - Sakshi

రెబ్బెన : స్వాతంత్య్రం కోసం, దేశ రక్షణ కోసం తమ జీవితాలను, ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరుల త్యాగాలు మరువలేనివని డీఎస్పీ సత్యనారాయణ అన్నారు. మంగళవారం మహాత్మగాంధీ వర్ధంతి, అమరవీరుల దినోత్సవాన్ని మండలంలోని ఇందిరానగర్, గోలేటికాలనీ, వంకుల ప్రభుత్వ పాఠశాలల్లో, స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం, సీఐ కార్యాలయంలో నిర్వహించారు. సీఐ కార్యాలయంలో డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి పోలీసు సిబ్బంది అమరవీరుల సేవలను స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమాల్లో తహసీల్దార్‌ సాయన్న, డీటీ విష్ణు, సీఐ పురుషోత్తం, రెబ్బెన ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ డిగ్రీ కళాశాల అధ్యాపకులు దేవాజీ, ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉమారాణి, జ్యోతి, రవికుమార్‌ పాల్గొన్నారు. 

మహాత్ముడికి ఘన నివాళి

ఆసిఫాబాద్‌ : జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని వాసవీ క్లబ్‌ ప్రతినిధులు అన్నారు. మహాత్మా గాంధీ 70వ వర్ధంతి సందర్భంగా మహాత్ముడికి ఘన నివాళి అర్పించారు. కార్యక్రమంలో క్లబ్‌ అధ్యక్ష, కార్యదర్శులు సాయిని సంతోష్, తాటికొండ ప్రవీణ్, కోషాధికారి పత్తి శ్యాం, ఆర్యవైశ్య సంఘం పట్టణ అధ్యక్షుడు చిలువేరి వెంకన్న, ప్రతినిధులు గుండా బాలేశ్వర్, గంధం శ్రీనివాస్, ఎకిరాల శ్రీనివాస్, గంధం వేణు, బోనగిరి దత్తాత్రి, కొలిప్యాక వేణు, గుండ వెంకన్న, సాయిని గోపాల్, తాటిపెల్లి శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు ఖాండ్రే విశాల్, మైనార్టీ నాయకుడు ఖాలీద్‌ బిన్‌ అవద్, ఆర్యవైశ్యులు పాల్గొన్నారు. 

రెండు నిమిషాలు మౌనం

వాంకిడి : దేశం కోసం అసువులు బాసిన అమరవీరులకు మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం, మాతృశ్రీ విద్యామందిర్లలో రెండు నిమిషాలు మౌనం పాటించి అమరవీరులకు నివాళులు అర్పించారు. తహసీల్దార్‌ మల్లికార్జున్, ఆర్‌ఐ దౌలత్‌రావు పాల్గొన్నారు. 

అమరవీరుల ఆత్మశాంతికి మౌనం

కెరమెరి : అమరవీరుల సంస్మరణ దినోత్సవంతో పాటు, జాతిపితా మహత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా మంగళావారం మండలంలో ఉమ్రి, సావర్‌కెడా, సాంగ్వి తదితర ప్రభుత్వ పాఠశాలల్లో, ఎంపీడీవో, తహసీల్దార్, ఎంఆర్సీ, అటవీ రేంజ్, ఈజీఎస్, ఐకేపీ కార్యాలయాల్లో రెండు నిమిషాలు మౌనం పాటించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వారిని ఇలా మననం చేయడం అదృష్టమని పలువురు వక్తలు పేర్కొన్నారు. కొన్ని చోట్ల మహత్మగాంధీ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. 

తిర్యాణిలో..

తిర్యాణి : మండలంలోని ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది, వ్యవసాయశాఖ కార్యాలయ సిబ్బంది మంగళవారం రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఎంపీడీవో కార్యాలయ సూపరింటెండెంట్‌ రవికుమార్, వ్యవసాయాధికారి తిరుమలేశ్వర్, ఏఈవోలు శ్రీధర్, ముత్తయ్య కార్యాలయ సిబ్బంది ఉన్నారు. 

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top