ప్రజ్ఞాపూర్‌కు నర్సింగ్ కళాశాల | Nursing college to pragnapur | Sakshi
Sakshi News home page

ప్రజ్ఞాపూర్‌కు నర్సింగ్ కళాశాల

Aug 22 2014 11:51 PM | Updated on Oct 9 2018 7:52 PM

వైద్య రంగంలో కీలకమైన నర్సింగ్ కోర్సులను గ్రామీణ విద్యార్థులకు చేరువ చేయాలన్నదే...

గజ్వేల్: వైద్య రంగంలో కీలకమైన నర్సిం గ్ కోర్సులను గ్రామీణ విద్యార్థులకు చేరువ చేయాలన్నదే తమ లక్ష్యమని, ఇందులో భాగంగా సికింద్రాబాద్‌లోని ఈశ్వరీబాయి మెమోరియల్ నర్సింగ్ కళాశాలను ప్రజ్ఞాపూర్‌కు మార్చనున్న ట్లు ఈశ్వరీబాయి మెమోరియల్ నర్సిం గ్ కళశాల డెరైక్టర్ డాక్టర్ రాంచంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ప్రజ్ఞాపూర్‌లోని ఆ ట్రస్ట్ రూరల్ క్యాంపు కార్యాలయంలో వయోవృద్ధులకు ఆరోగ్య సలహాలు, నర్సింగ్ విద్య ప్రాముఖ్యత తదితర అంశాలపై నిర్వహించిన సదస్సులో ప్రసంగించారు. నర్సింగ్ విద్య పై చిన్నచూపు సరికాదన్నారు. సికింద్రాబాద్‌లోని నర్సింగ్ కళాశాలను ప్రజ్ఞాపూర్‌కు మార్చి, ఈ ప్రాంత విద్యార్థులకు ఉపయోగపడేలా చూస్తామన్నారు.

ఈ కేంద్రంలో నర్సింగ్‌కు సంబంధించి పీజీ, గ్రాడ్యుయేషన్ కోర్సులను నడుపుతామన్నారు. కేంద్రానికి అనుబంధంగా బాలికలకు వృత్తి విద్య శిక్షణా కోర్సులను కూడా ప్రవేశపెట్టనున్నామని వెల్లడించారు. ఈ ప్రాంతంలోని వయోవృద్ధులకు ఆరోగ్య సలహాలు, సూచనలు ఇవ్వడానికి ప్రయత్నిస్తామన్నారు. గతంలో తన సతీమణి డాక్టర్ జే గీతారెడ్డి ఇక్కడి నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్రమంత్రిగా పనిచేయడానికి అన్ని విధాలుగా సహకరించిన ప్రజలు ఈ కేంద్రం విజయవంతంగా నడవడానికి సహకరించాలని కోరారు.

సమావేశంలో ఈశ్వరీబాయి మెమోరియల్ కళశాల బాధ్యురాలు మేఘన, గజ్వేల్ మాజీ ఎంపీపీ పొన్నాల రఘుపతిరావు, మాజీ మార్కెట్ కమటీ చైర్మన్ డాక్టర్ వీ యాదవరెడ్డి, జెడ్పీటీసీ జే వెంకటేశం గౌడ్, గజ్వేల్‌కు చెందిన ప్రముఖ వైద్యులు మల్లయ్య, కుమారస్వామి, కాంగ్రెస్ ఎస్సీ జిల్లా ఉపాధ్యక్షుడు జీ నర్సింలు, నర్సింగ్ కళాశాల డీన్ హేమలత సరోజిని, ప్రిన్సిపాల్ ప్రసన్న కుమారి, నర్సింగ్ పాఠశాల ప్రిన్సిపాల్ ఏ జోస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నర్సింగ్ కళాశాల విద్యార్థినులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement