Sakshi News home page

ఎన్టీఆర్ మృతిపై విచారణ

Published Sat, Nov 29 2014 1:44 AM

NTR death trial

  • తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లక్ష్మీపార్వతి లేఖ
  • సాక్షి, హైదరాబాద్: ఏపీ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు మృతిపై విచారణ కోరుతూ ఆయన సతీ మణి, మాజీ ఎమ్మెల్యే నందమూరి లక్ష్మీపార్వతి తెలంగాణ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. శంషాబాద్ విమానాశ్రయ దేశీయ టెర్మినల్‌కు ఎన్టీఆర్ పేరు కొనసాగించినంత మాత్రాన తెలంగాణకు నష్టం వాటిల్లదని, దానిపై వివాదానికి తావ్వివద్దని కోరారు. లక్ష్మీపార్వతి శుక్రవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లేఖ ప్రతులను విడుదల చేశారు.

    విమానాశ్రయ టెర్మినల్ తిరిగి ఎన్టీఆర్ పేరు పెట్టిన నేప థ్యంలో కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ... ఎన్టీఆర్  మృతిపై విచారణ జరపాలంటూ డిమాండ్ చేయడాన్ని లేఖలో ప్రస్తావించారు. వీహెచ్ డిమాండ్‌కు స్పందిస్తూ తానూ కేసీఆర్‌కు లేఖ రాస్తున్నట్టు చెప్పారు. ఎన్టీఆర్ చనిపోవడానికి ముందు రోజు 1996 జనవరి 17వ తేదీన ఏం జరిగిందన్న దానిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని ఆమె డిమాండ్ చేశారు.

    విచారణ కమిటీలో టీడీపీ సీనియర్ నాయకుడిని కూడా సభ్యుడి నియమించినా తనకు అభ్యంతరం లేదని చెప్పారు. చంద్రబాబు, ఆయన తోకపత్రికలు మసిపూసి మారేడుకాయ చేసిన వాస్తవాలు వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.

Advertisement
Advertisement