స్వైన్‌ఫ్లూ వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు.
‘సాక్షి’ కథనంపై మంత్రి లక్ష్మారెడ్డి స్పందన
సాక్షి, హైదరాబాద్: స్వైన్‌ఫ్లూ వైరస్‌పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వైరస్ అదుపులోనే ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ‘మళ్లీ స్వైన్‌ఫ్లూ విజృంభణ’ అనే శీర్షికన గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన వార్తా కథనంపై ఆయన స్పందించారు.
దీనిపై గురువారం ఆయన సచివాలయంలో వైద్యాధికారులతో సమీక్షించారు. స్వైన్‌ఫ్లూ విస్తరిస్తున్న దృష్ట్యా వైద్యులంతా అప్రమత్తంగా ఉండాలని, అన్ని ప్రభుత్వాస్ప త్రుల్లోనూ మందులు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. చలిగాలులు వీస్తుండటంతో హెచ్1ఎన్1 వైరస్ బలపడే అవకాశం ఉందని, ఇప్పటికే హైదరా బాద్ సహా పలు జిల్లాల్లో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.