8 నుంచి కూడా భక్తులకు అనుమతిలేదు | No Entry in Chilkur Balaji Temple Still COVID 19 Effects | Sakshi
Sakshi News home page

8 నుంచి కూడా భక్తులకు అనుమతిలేదు

Jun 2 2020 8:28 AM | Updated on Jun 2 2020 8:28 AM

No Entry in Chilkur Balaji Temple Still COVID 19 Effects - Sakshi

మొయినాబాద్‌: ఈ నెల 8 నుంచి దేవాలయా లు తెరిచేందుకు కేంద్ర ప్రభుత్వం సడలి ంపు ఇచ్చినా చిలుకూరు బాలాజీ దేవాలయం మాత్రం తెరుచుకోదని ఆలయ అర్చకుడు రంగరాజన్‌ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కోవిడ్‌–19 కట్టడిలో భాగంగా లాక్‌డౌన్‌కు ముందు నుంచే చిలుకూరు బాలాజీ దేవాలయానికి భక్తుల రాకను నిలిపివేశామన్నారు. లాక్‌డౌన్‌లో స్వామివారికి రోజువారి పూజలు నిర్వహిస్తున్నామని, భక్తులు మాత్రం ఎవరూ ఆలయానికి రాలేదని చెప్పారు. జూన్‌ 8 నుంచి ఆలయాల్లోకి భక్తులు వెళ్లేందుకు ప్రభుత్వం సడలింపు ఇచ్చినా కరోనా కట్టడికోసం చిలుకూరులో మాత్రం భక్తులను అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. బాలాజీ దర్శనం కోసం భక్తులెవరూ రావద్దని కోరారు. భక్తులను ఎప్పటి నుంచి అనుమతించాలనే విషయాన్ని పరిస్థితులను బట్టి నిర్ణయిస్తామని రంగరాజన్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement