హుహు..హూ! రాత్రిపూట పడిపోతున్న ఉష్ణోగ్రతలు 

Night Time Temperatures Are Decreased - Sakshi

ఉదయం 9 దాటినా వదలని చలి 

జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్న వైద్యులు 

సాక్షి, పాలమూరు: వారం రోజులుగా వాతావరణం లో చోటుచేసుకున్న మార్పుల కారణంగా  జిల్లా లో చలివిపరీతంగా పెరిగింది. రాత్రి వేళ ఉష్ణో గ్రతలు పడిపోతుండటంతో ప్రజలు బయటికి రావాలంటే వెనకాడుతున్నారు. ఆరురోజుల నుంచి సాయంత్రం కాగానే ఆకా శంలో మేఘా లు కమ్ముకోవడం, చల్లని గాలు లు వీస్తుండటంతో ప్రజలు వణికిపోతున్నా రు. ఉదయం 9 గంటల వరకు పొగమంచు కమ్మేస్తుండటంతో ప్రయాణానికి ఆటంకం కలుగుతోంది. 

జాగ్రత్తలు తప్పనిసరి.. 
చలికాలంలో వృద్ధులు, చిన్న పిల్లలపట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి అంటున్నారు వైద్యులు. పగటి ఉష్ణోగ్రతలు అధికంగానే ఉంటున్నా సాయంత్రం తర్వాత  పెరుగుతుండటంతో ప్రజలు చలిని తట్టుకోవడానికి అన్ని రకాల సౌకర్యాలతోపాటు ఉన్ని దుస్తులు అందుబాటులో ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ఏ గ్రామంలో చూసినా  జలజ్వరం, జలుబు, దగ్గు వంటి సమస్యలతో ప్రజలు ఆస్పత్రులకు చేరుతున్నారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు ఆహారపు అలవాట్లలో స్వల్ప మార్పులు చేసుకుంటే శరీరాన్ని కాపాడుకోవచ్చని సలహా ఇస్తున్నారు. 
 

హైపథెరమితో ముప్పు 
చలి తీవ్రతను కొందరు వృద్ధుల్లో చేతులు వంకర పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీన్నే ప్రాస్ట్‌బైట్‌ అంటారు. వృద్ధుల శరీరానికి కావాల్సిన ఉష్ణోగ్రతలు ఉత్పత్తి కాకపోవడంతో మరణాలు సంభవిస్తాయి. దీన్ని వైద్య పరిభాషలో హైపోథెరమి అంటారు. శరీరంలోని రక్తనాళాల్లో రక్తం సరఫరాలో మార్పులు చోటుచేసుకుంటాయి. ఈ కాలంలో ఆస్తమా వ్యాధిగ్రస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి ఊపిరితిత్తుల సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. బ్యాక్టీరియా వైరల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ వస్తాయి.

జలుబు వల్ల ముక్కులోని నాళాల్లో సున్నితత్వం పెరుగుతుంది. ఇది ఆస్తామా బాధితులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పొడి చర్మం కలిగిన వారిలో దురదలు, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ వస్తాయి. గొంతు ఇన్‌ఫెక్షన్, కీళ్ల నొప్పులు పెరుగుతాయి. గతంలో కీళ్ల నొప్పులు ఉన్న వారికి సమస్య అధికమవుతుంది. కొందరిలో తలనొప్పి వస్తుంది. గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  

పాలీమార్పస్‌లైట్‌తో సమస్య 
కొంత మందిలో చలి కాలంలో కూడా పొక్కులు వస్తాయి. దీన్ని పాలీమార్పస్‌లైట్‌ ఎరప్షన్‌ అంటారు. మహిళలు బట్టలు ఉతకడం, గిన్నెలను తోమడం వంటి పనులను ఎక్కువగా చేస్తుంటారు. చలికాలంలో ఎక్కువ సమయం నీళ్లలో చేతులు ఉంచి పనులు చేయడం వల్ల చేతిపై ఉండే నూనె పొర తొలగిపోతుంది. సబ్బులు, డిటర్జెంట్లను ఉపయోగించడం వల్ల నూనె పొర తొలిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా చర్మం పొడిబారి చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి.

శీతల గాలులు చర్మాన్ని ఇబ్బంది పెడతాయి. శరీరాన్ని రక్షించే క్రమంలో చర్మమే చలికి ప్రభావితమవుతుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ గాలిలో తేమశాతం తక్కువగా ఉంటుంది. శరీరంలోని తేమ బయటికి పోవడంతో చర్మం పొడిబారుతుంది. నూనె పొరను కాపాడుకునేందుకు ప్రయత్నించాలి. ఈ కాలంలో ఎండ తీక్షణంగా లేకపోయినా సూర్యకాంతి నుంచి అతినీలలోహిత కిరణాలు వెలువడతాయి. 

వ్యాయామానికి వెళ్లే ముందు 
ఎక్కువ మంది వ్యాయామం అంటే ఉదయపు నడకకే అధిక ప్రాధాన్యం ఇస్తారు. మహిళలు, మధ్య వయసు ఉన్నవారు, వృద్ధులు ఎక్కువగా వెళ్తుంటారు. మిగితాకాలంలో పోల్చితే శీతాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఉదయం 6నుంచి 8గంటల మధ్య పొగ మంచులో కాలుష్యం కలిసి ఉంటుంది. బాగా ఎండ వచ్చే వరకు అదే పరిస్థితి ఉంటుంది. ఈ సమయంలో మార్నింగ్‌ రన్నింగ్‌ చేసే వాళ్లు దాన్ని పీల్చేవారు శ్వాసకోశ వ్యాధులు బారినపడే ప్రమాదం ఉంటుంది.

ఈ మూడు నెలలు ఉదయం ఏడు గంటలు దాటిన తర్వాత వాకింగ్‌ చేయడం ఉత్తమం. కుదరకపోతే సాయంత్రం వేళలో చేసుకోవాలి. తప్పదని అనుకునేవారు ముఖం, ముక్కు, చెవులు కప్పి ఉంచే టోపీలు, దుస్తులు, స్వెటర్లు ధరించాలి.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top