నక్సల్స్ చేతిలో రైతు హతం | naxals killed farmer in khammam | Sakshi
Sakshi News home page

నక్సల్స్ చేతిలో రైతు హతం

Jan 25 2015 8:44 PM | Updated on Oct 1 2018 4:01 PM

ఇన్ఫార్మర్ నెపంతో రైతు హత్యకు గురైన సంఘటన ఖమ్మం జిల్లా చింతూరు మండలం ప్యాగ గ్రామంలో ఆదివారం జరిగింది.

చింతూరు: ఇన్ఫార్మర్ నెపంతో రైతు హత్యకు గురైన సంఘటన ఖమ్మం జిల్లా చింతూరు మండలం ప్యాగ గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలు.. ప్యాగ గ్రామానికి చెందిన సోడో ముత్తయ్య(50) అనే రైతు తన పొలంలో జమాయిల్ పంట పండిస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే, మావోలు ఆ పంటను సేద్యం చేయవద్దని హెచ్చరించారు.

అయినా రైతు వినకపోవడంతో శనివారం సాయంత్రం బంధించి తీసుకెళ్లారని గ్రామస్తులు తెలిపారు. ముత్తయ్యను ఆదివారం చత్తీస్గఢ్ సరిహద్దుల్లో హతమార్చి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. పోలీసులకు ఇన్‌పార్మర్‌గా వ్యవహరిస్తున్నాడనే కారణంతో అతన్ని చంపారనేది మరో కథనం.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement