సీపీఎం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డికి ప్రజలు కన్నీటివీడ్కోలు పలి కారు.
చిట్యాల: సీపీఎం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డికి ప్రజలు కన్నీటివీడ్కోలు పలి కారు. శుక్రవారం నల్లగొండ జిల్లా చిట్యాల మండ లం వట్టిమర్తిశివారులోని ఆయన వ్యవసాయ క్షేత్రం లో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరి గాయి.అశేష జనవాహిని మధ్య అంతిమయాత్ర సాగింది. పోలీసులు గాలిలోకి తుపాకులతో మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. నివాళులర్పించినవారిలో సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం, సీఎల్‌పీ నేత జానారెడ్డి, ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి గాదరి కిశోర్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారు.