అధికార లాంఛనాలతో 'నర్రా' అంత్యక్రియలు | Narra Raghava Reddy funeral | Sakshi
Sakshi News home page

అధికార లాంఛనాలతో 'నర్రా' అంత్యక్రియలు

Apr 10 2015 11:02 AM | Updated on Sep 15 2018 3:36 PM

అధికార లాంఛనాలతో 'నర్రా' అంత్యక్రియలు - Sakshi

అధికార లాంఛనాలతో 'నర్రా' అంత్యక్రియలు

ప్రజా సేవకుడు, కమ్యూనిస్టు కురవృద్ధుడు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

హైదరాబాద్ :  ప్రజా సేవకుడు, కమ్యూనిస్టు కురవృద్ధుడు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే నర్రా రాఘవరెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.  అంత్యక్రియల ఏర్పాట్లను పర్యవేక్షించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు.  నర్రా రాఘవరెడ్డి (91)   గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే.

ఈరోజు ఉదయం నర్రా రాఘవరెడ్డి 11 గంటల వరకు పార్థీవ దేహాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచి అనంతరం నకిరేకల్ కేంద్రానికి తరలిస్తారు. అక్కడి నుంచి వట్టిమర్తి గ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహిస్తారని . అంత్యక్రియలకు తమ్మినేని వీరభద్రం, రాఘవులుతోపాటు ఇతర రాష్ట్ర నాయకులు హాజరవుతారన్నారు. ఈ నెల 12వ తేదీ వరకు సంతాప దినాలను పాటించి గ్రామ గ్రామాన సంతాప సభలు నిర్వహిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement