వరవరరావు బెయిల్ పిటిషన్‌‌ నిరాకరణ

Mumbai Court Rejected Varavara Rao Bail Petition - Sakshi

సాక్షి, ముంబై: విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు బెయిల్‌ పిటిషన్‌ను ముంబై కోర్టు నిరాకరించింది. వరవరరావు అనారోగ్యంగా ఉన్నారని, బెయిల్‌ ఇవ్వాలంటూ ఆయన తరపున న్యాయవాదులు దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టి వేసింది. భీమా కోరేగావ్‌ కేసులో వరవరరావు కీలక నిందితుడని, ఆయనకు బెయిల్‌ ఇవ్వొద్దని జాతీయ దర్యాప్తు సంస్థ (ఏన్‌ఐఏ) అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది. (వరవరరావుకు తీవ్ర అస్వస్థత)

ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు కుట్ర పన్నారనే ఆరోపణలపై 2018 నవంబర్‌లో అరెస్టయిన వరవరరావును తొలుత మహారాష్ట్ర పుణేలోని ఎరవాడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే..  ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎరవాడ నుంచి నవీ ముంబైలోని తలోజా జైలుకు తరలించారు.  తలోజా జైలులో కరోనా బారిన పడి ఒకరు మరణించినట్లు ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. ఈ నేపథ్యం లో వృద్ధుడైన తమ తండ్రిని జైలు నుంచి విడుదల చేయాలంటూ వరవరరావు కుమార్తెలు ఇటీవల మహా రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి తదితరులకు లేఖలు కూడా రాశారు. (వరవరరావు కేసు: ఎఫ్‌బీఐకు హార్డ్‌డిస్క్‌!)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

సంబంధిత వార్తలు



 

Read also in:
Back to Top