
ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను చితకబాదిన 'తమ్ముళ్లు'
కరీంనగర్ లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు మాదిగల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది.
కరీంనగర్ : కరీంనగర్ లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటనకు మాదిగల నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. చంద్రబాబు సభలో మాట్లాడుతుండగా నల్లజెండాలతో వేదిక వద్దకు ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు దూసుకెళ్లారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. సభను అడ్డుకుంటున్న ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను తెలుగు తమ్ములు చితకబాదారు.
అనంతరం ఆందోళన కారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అంతకు ముందు చంద్రబాబు సభను అడ్డుకునేందుకు హోటల్ నుంచి బయలు దేరిన మందకృష్ణను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నించారు. దీంతో ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆగ్రహంతో హోటల్ అద్దాలు ధ్వంస చేశారు. చంద్రబాబు మాదిగ వర్గీకరణపై ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని దుయ్యబట్టారు.