రిషితేశ్వరి ఆత్మహత్యపై విచారణ జరపాలి | mp kavitha demands, suicide case of rishiteswari should be investgated | Sakshi
Sakshi News home page

రిషితేశ్వరి ఆత్మహత్యపై విచారణ జరపాలి

Jul 28 2015 1:26 AM | Updated on Nov 6 2018 8:41 PM

నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని రిషితేశ్వరి మృతిపై సమగ్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత డిమాండ్ చేశారు.

ఏపీ సీఎం చంద్రబాబుకు ఎంపీ కవిత లేఖ


 సాక్షి, హైదరాబాద్: నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్‌లో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని రిషితేశ్వరి మృతిపై సమగ్రంగా, నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు లేఖ రాశారు. సమాజానికి దారిచూపాల్సిన విశ్వవిద్యాలయాలు అరాచక శక్తుల చేతులకు చిక్కి ఆటవిక ప్రవృత్తికి వేదికలవడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో నిందితులకు పలుకుబడి ఉన్న వారి అండదండలున్నాయనే వార్తలు వస్తున్నట్లు ఆమె చెప్పారు. ఇలాంటి ఘటనలపై అప్రమత్తంగా ఉండి ఆడకూతుళ్లు బలి కాకుండా చూడాలని కోరారు.

 


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement