
'80 రైతు కుటుంబాల దత్తత'
తెలంగాణలో ఆత్మహత్యకు పాల్పడిన 80 రైతు కుటుంబాలను దత్తత తీసుకున్నామని టీఆర్ ఎస్ పార్టీ ఎంపీ కవిత అన్నారు.
హైదరాబాద్: తెలంగాణలో ఆత్మహత్యకు పాల్పడిన 80 రైతు కుటుంబాలను దత్తత తీసుకున్నామని టీఆర్ ఎస్ పార్టీ ఎంపీ కవిత అన్నారు. తెలంగాణ జాగృతి తరుపున వారి కుటుంబాలకు నవంబర్ 1నుంచి సహాయం అందజేస్తామని చెప్పారు. ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాలకు సహాయం చేసేందుకు సానియా మీర్జా, గుత్తా జ్వాలా, ప్రజ్ఞాన్ ఓజా ముందుకొచ్చారని చెప్పారు. సానియా రూ.3లక్షలు, ప్రజ్ఞాన్ ఓజా, గుత్తా జ్వాలా చెరో లక్ష విరాళంగా ఇచ్చారని ఎంపీ కవిత తెలిపారు.