
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ చైర్‌పర్సన్‌గా జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా జాగృతి యూత్ విభాగం రాష్ట్ర కన్వీనర్ కె.విజయ్‌కుమార్, సంఘం న్యాయ సలహాదారుగా న్యాయవాది ఆర్.మహదేవన్ వ్యవహరిస్తారు.
హైదరాబాద్ సుల్తాన్‌బజార్‌లోని శ్రీ హనుమాన్ వ్యాయామశాలలో బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సోమవారం సమావేశమై ఈ మేరకు తీర్మానించింది. సంఘం గౌరవ కార్యదర్శి మోహన్‌రావు, మిగతా కార్యవర్గం యథావిధిగా కొనసాగుతుందని అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.