breaking news
Telangana body building Association
-
‘బాడీ బిల్డింగ్’ చైర్‌పర్సన్‌గా ఎంపీ కవిత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ చైర్‌పర్సన్‌గా జాగృతి అధ్యక్షురాలు, ఎంపీ కవిత ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా జాగృతి యూత్ విభాగం రాష్ట్ర కన్వీనర్ కె.విజయ్‌కుమార్, సంఘం న్యాయ సలహాదారుగా న్యాయవాది ఆర్.మహదేవన్ వ్యవహరిస్తారు. హైదరాబాద్ సుల్తాన్‌బజార్‌లోని శ్రీ హనుమాన్ వ్యాయామశాలలో బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సోమవారం సమావేశమై ఈ మేరకు తీర్మానించింది. సంఘం గౌరవ కార్యదర్శి మోహన్‌రావు, మిగతా కార్యవర్గం యథావిధిగా కొనసాగుతుందని అసోసియేషన్ ఓ ప్రకటనలో తెలిపింది. -
బాడీ బిల్డింగ్ చాంప్ అహ్మద్ బామాస్
కాచిగూడ, న్యూస్‌లైన్: షేక్ హుస్సేన్ మెమోరియల్ బాడీ బిల్డింగ్ చాంపియన్‌షిప్‌లో అహ్మద్ బామాస్ విజేతగా నిలిచాడు. తెలంగాణ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాచిగూడలోని నెహ్రూనగర్ మైదానంలో ఈ పోటీలు నిర్వహించారు. ఇందులో జంట నగరాల నుంచి దాదాపు 150 జిమ్‌లకు చెందిన సుమారు 200 మంది బాడీబిల్డర్లు పాల్గొన్నారు. తొలి స్థానంలో నిలిచిన అహ్మద్‌కు ట్రోఫీతో పాటు నగదు బహుమతి కూడా అందజేశారు. రాజు రన్నరప్‌గా నిలువగా, శివకు మూడో స్థానం దక్కింది. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన సికింద్రాబాద్ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్ విజేతలకు ట్రోఫీలు అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్వాహకులు ఎండీ సలీమ్, ఎండీ ఖాజా, ఎండీ ఖాదర్, మాజీ మంత్రి కృష్ణయాదవ్, పీసీసీ కార్యదర్శి ఆర్.లక్ష్మణ్ యాదవ్, డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు మహ్మద్ ముస్తాఫా అలీ, భావి ధన్‌రాజ్, బాడీ బిల్డర్స్ సంతోష్, మోతేశామ్ తదితరులు పాల్గొన్నారు.