‘వాళ్లు బిగ్‌బాస్ షోలో టైంపాస్ చేసుకోవచ్చు’
కాంగ్రెస్ నాయకులకు ఏ పని, పాట లేకపోతే బిగ్ బాస్ షోకు వెళ్లి టైం పాస్ చేసుకోవచ‍్చని ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఎద్దేవా చేశారు.
యాదగిరిగుట్ట: కాంగ్రెస్ నాయకులకు ఏ పని, పాట లేకపోతే బిగ్ బాస్ షోకు వెళ్లి టైం పాస్ చేసుకోవచ‍్చని భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులను కాంగ్రెస్ నాయకులు అడ్డుకుంటున్నారని విమర్శించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని తెలిపారు. జాతీయ రహదారి విస్తరణలో అండర్ పాస్ నిర్మాణాల కోసం కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు.
వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంతో సామరస్య పూర్వకంగా మెలుగుతూ అభివృద్ధి చేస్తామని తెలిపారు. బీజేపీతో అభివృద్ధి ఎజెండా మాత్రమే ఉంటుందని రాజకీయ ఎజెండా ఉండదని ఆయన స్పష్టం చేశారు. యాదాద్రి పుణ్యక్షేత్రం భవిష్యత్‌లో ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతుందని ఎంపీ చెప్పారు.